ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 25 November 2026, 6:31 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

నీలకంఠేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం క‌విత‌

నిజామాబాద్.అర్జున్ సమాచారం:
నిజామాబాద్ కంఠేశ్వర్ లోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారిని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని అభిషేకం,  ప్రత్యేక పూజలు చేసారు.
కవిత మాట్లాడుతూ భక్తులకు నీలకంఠేశ్వర స్వామి కొంగు బంగారం.   కార్తీక పౌర్ణమి రోజు స్వామి వారి దర్శనం.. మరుసటి రోజు శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారికి అభిషేకం చేయడం మా కుటుంబ ఆనవాయితయ‌ని అన్నారు.
నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయంలో మరికొన్ని అభివృద్ధి పనులు చేయాల్సి ఉందని అర్చకులు తెలిపారు. నిజామాబాద్ బిడ్డగా ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తాను. ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచడాన్ని తమ రెస్పాన్సిబులిటీ గా తీసుకున్న యువతకు ధన్యవాదాలు. ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలని అన్నారు.
==================